
హైదరాబాద్: నగరంలోని బాచుపల్లిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బాచుపల్లిలోని ఇందిరమ్మ కాలనీలో ఉన్న ఓ కొబ్బరికాయల గోడౌన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి గోదామ్ మొత్తం విస్తరించడంతో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. మంటల ధాటికి రసాయన డబ్బాలు పేలిపోతున్నాయి. దీంతో కొబ్బరికాయల గోదామ్ పరిసర ప్రాంతాల్లో పొగలు దట్టంగా అలముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. కాగా అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు వెల్లడించారు.