పవర్ ప్లేలోనే సంజూ మ్యాచ్‌‌‌‌ను గెలిపించగలడు: గంభీర్

పవర్ ప్లేలోనే సంజూ మ్యాచ్‌‌‌‌ను గెలిపించగలడు: గంభీర్

న్యూఢిల్లీ: టీమిండియా ఓపెనర్ సంజూ శాంసన్ తనదైన రోజున పవర్ ప్లేలోనే ప్రత్యర్థి జట్ల నుంచి మ్యాచ్‌‌‌‌ను లాగేసుకోగలడని హెడ్‌‌‌‌ కోచ్ గౌతమ్ గంభీర్ అన్నాడు. ఇండియా మూడోసారి టీ20 వరల్డ్ కప్‌‌‌‌ నెగ్గడంలో కీలక పాత్ర పోషించిన సంజూపై గౌతీ ప్రశంసలు కురిపించాడు.‘సంజూ టాలెంట్, అతని బ్యాట్ పవర్ పై మాకు ఎప్పుడూ అనుమానం లేదు.  

తొలి ఆరు ఓవర్లలోనే జట్టును గెలిపించే సత్తా సంజూకు ఉంది. వరల్డ్ కప్‌ తుది జట్టులో ముగ్గురు లెఫ్టాండ్ బ్యాటర్లు ఉన్నప్పటికీ కేవలం ఆ కాంబినేషన్ మార్చడం కోసం కాకుండా జట్టులో మరింత దూకుడు పెంచేందుకే శాంసన్‌‌‌‌ను ఎంపిక చేశాం. గత ఏడాదిన్నర కాలంగా జట్టులో వీలైనంత దూకుడుగా ఆడాలనే సిద్ధాంతంతో ఉన్నాం. అందుకే ఆఫ్ స్పిన్నర్లకు కౌంటర్ ఇచ్చేందుకు కాకుండా టాపార్డర్‌‌‌‌‌‌‌‌ పవర్ పెంచేందుకు, పవర్ ప్లేలో మరింత దూకుడుగా ఆడేందుకే సంజూను ఓపెనర్‌‌‌‌‌‌‌‌గా దింపాం’ అని పేర్కొన్నాడు.