మౌంట్ మాగనుయ్ (న్యూజిలాండ్): ఆల్‌రౌండ్ షోతో ఆకట్టుకున్న సౌతాఫ్రికా.. బోణీ చేసింది. బౌలింగ్‌లో ఎంకోబాని మోకోనా (3/26)కు తోడు బ్యాటింగ్‌లో కానర్ ఎస్టర్‌హైజెన్ (45 నాటౌట్) రాణించడంతో.. ఆదివారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో సఫారీ జట్టు 7 వికెట్ల తేడాతో నెగ్గింది. దాంతో సిరీస్‌లో 1–0 ఆధిక్యంలో నిలిచింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ 14.3 ఓవర్లలో 91 రన్స్‌కే ఆలౌటైంది.
జేమ్స్ నీషమ్ (26) టాప్ స్కోరర్. మ్యాచ్ ఆరంభం నుంచే సఫారీ బౌలర్లు గెరాల్డ్ కోయెట్జీ (2/14), ఒటెనిల్ బార్ట్‌మన్ (2/22), కేశవ్ మహారాజ్ (2/25) దెబ్బకు ఇన్నింగ్స్‌లో ఏడుగురు సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. ఛేజింగ్‌లో సౌతాఫ్రికా 16.4 ఓవర్లలో 93/3 స్కోరు చేసి నెగ్గింది. ఇన్నింగ్స్ పదో బాల్‌కే టోనీ డి జార్జీ (2) ఔటైనా.. కానర్ నిలకడగా ఆడాడు మోకోనాకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య రెండో టీ20 మంగళవారం హామిల్టన్‌లో జరుగుతుంది.
