పాతబస్తీలో అగ్ని ప్రమాదం  : పరుపుల గోదాంలో మంటలు

పాతబస్తీలో అగ్ని ప్రమాదం  : పరుపుల గోదాంలో మంటలు

హైదరాబాద్  :  పాతబస్తీలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చాంద్రాయణ గుట్ట పరిధిలోని బండ్లగూడ ప్రాంతం అలీ నగర్​ ఏరియాలో ఉన్న పరుపుల గోదాంలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అందులో పనిచేసేవాళ్లు అప్రమత్తమై అగ్నిమాపక విభాగానికి సమాచారాన్ని చేరవేశారు. వెంటనే రెండు ఫైర్ ఇంజన్లు వచ్చి మంటలను ఆర్పడాన్ని మొదలుపెట్టాయి. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్రగాయాలు కావడంతో  ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. అయితే ఈ అగ్ని ప్రమాదం ఎలా జరిగింది అనే వివరాలు తెలియాల్సి ఉంది.