పంజాగుట్ట,వెలుగు: బేగంపేటలోని మహాత్మ జ్యోతిరావ్ఫూలే ప్రజాభవన్లో మంగళ వారం నిర్వహించిన ప్రజావాణికి భారీ సంఖ్యలో ప్రజలు హాజరై , అర్జీలు అందించారు. మొత్తం 395 ఫిర్యాదులు అందగా వాటిలో హౌసింగ్ సంబంధించి 125, రెవెన్యూ విభాగానికి చెందినవి 50,ఎనర్జీ విభాగానికి చెందినవి 36,మైనారిటీ వెల్ఫేర్కు చెందినవి 30, పీఆర్ అండ్ ఆర్డీ విభాగానికి 28, ప్రవాసీ ప్రజావాణికి 5, ఇతర విభాగాలకు చెందినవి 121 ఉన్నాయని ప్రజావాణి అధికారులు తెలిపారు.
