కన్నతల్లిని గొంతు కోసి చంపిండు     

కన్నతల్లిని గొంతు కోసి చంపిండు     
  •  భార్యకు సపోర్టు చేయడమే కారణం

పెద్దమందడి, వెలుగు: భార్యకు సపోర్టు చేస్తుందనే కారణంతో వనపర్తి జిల్లాలో కన్నతల్లిని గొంతు కోసి చంపేశాడో కొడుకు. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం అమ్మపల్లి అనుబంధ గ్రామమైన బండకాడి తండాకు చెందిన వర్త్యావత్ చిన్నమ్మ(50)కు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు రాజునాయక్ ఇటీవల హైదరాబాద్​లో ఇల్లు కొన్నాడు. అయితే సదరు ఇల్లు వాస్తు సరిగా లేదని, అమ్మేసి వేరేచోట కొందామని భార్య పార్వతి కొన్నాళ్లుగా రాజును ఒత్తిడి చేస్తోంది. ఇల్లు కొన్నప్పటి నుంచి కుటుంబ సభ్యులు ఎవరికీ ఆరోగ్యం సరిగా లేదని వాపోతోంది.

ఆమెకు అత్త చిన్నమ్మ కూడా సపోర్టు చేస్తోంది. ఇదే విషయమై బుధవారం రాత్రి ఇంట్లో గొడవ జరిగింది. రాజు గురువారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని టైంలో కత్తిపీటతో తల్లి చిన్నమ్మ గొంతు కోసి చంపేశాడు. మృతురాలి చిన్న కొడుకు సూర్యనాయక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సీఐ రత్నం, ఎస్సై హరిప్రసాద్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.