సెల్ఫీ వీడియో తీసుకొని వ్యక్తి సూసైడ్

సెల్ఫీ వీడియో తీసుకొని వ్యక్తి సూసైడ్
  • బోరబండ​లో ఘటన

జూబ్లీహిల్స్, వెలుగు: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనుచరులు తనను వేధిస్తున్నారని ఓ వ్యక్తి సెల్ఫీ వీడియో తీసుకొని సూసైడ్​ చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం.. బోరబండ డివిజన్ సాయిబాబానగర్​కు చెందిన శ్రీనివాస్​ గౌడ్​(48) స్థానిక హోటల్లో పనిచేస్తున్నాడు. కొన్నాళ్లుగా వారి బంధువుల మధ్య బాబా శైలాని నగర్​లో ఉన్న ఆస్తి తగదాను ఆసరాగా చేసుకుని శ్రీనివాస్​ను బీఆర్ఎస్​కు చెందిన లీడర్లు ప్రశాంత్, సాయిచరణ్, డి.రాజు కలిశారు. 

వివాదాన్ని పరిష్కరించి, ఆ స్థలాన్ని అమ్మిపెడతామని చెప్పారు. ఆస్తి వివాదం కొలిక్కి వచ్చిన తర్వాత శ్రీనివాస్​ను డబ్బుల కోసం డిమాండ్​చేశారు. దీంతో వారి వేధింపులు భరించలేక శ్రీనివాస్ శుక్రవారం అర్ధరాత్రి సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు బాధిత కుటుంబసభ్యుల ఇచ్చిన ఫిర్యాదుతో బోరబండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులను అరెస్ట్ చేసినట్టు  సీఐ వీరశేఖర్​ తెలిపారు.