జమ్మికుంట, వెలుగు : అదనపు కట్నం వేధింపులు భరించలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంలో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... టేకుర్తి గ్రామానికి చెందిన కిషన్‌తో కొన్నేండ్ల కింద కల్యాణి (30)కి వివాహమైంది.
కొన్ని సంవత్సరాలు బాగానే ఉన్న తర్వాత రూ. 2 లక్షల అదనపు కట్నం తేవాలని కిషన్‌తో పాటు అతడి తండ్రి మల్లయ్య, కుటుంబ సభ్యులు కల్యాణిని వేధించేవారు. వేధింపులతో మనస్తాపానికి గురైన కల్యాణి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి స్వామి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై క్రాంతికుమార్ తెలిపారు.
