పద్మారావునగర్, వెలుగు: అమీర్పేటలో రూ.25 కోట్ల విలువైన 1,500 గజాల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడడంపై పీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్‌నగర్ ఇన్చార్జి డాక్టర్ కోట నీలిమ హర్షం వ్యక్తం చేశారు. శనివారం ఈ స్థలంలో ఫెన్సింగ్ పనులను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. త్వరలో ఇక్కడ ఆధునిక పార్కు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన హైడ్రా వల్ల అక్రమాలు బయటపడుతున్నాయని, ప్రభుత్వ ఆస్తులు రక్షణ పెరిగిందన్నారు. ఆమె వెంట స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
