
- అగ్రిహబ్ ఆధ్వర్యంలో 15 అగ్రిస్టార్టప్స్ సంస్థలకు గుర్తింపు పత్రాలు
హైదరాబాద్, వెలుగు: ఆకుకూరల సాగులో రోబోలు కొత్త ఒరవడి సృష్టించనున్నాయని అగ్రికల్చర్వర్సిటీ వీసీ ప్రొఫెసర్అల్దాస్జానయ్య అన్నారు. సోమవారం ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీ ఆధ్వర్యంలోని అగ్రి హబ్ ఇన్నోవేషన్ సెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో15 అగ్రిస్టార్టప్స్ సంస్థలకు గుర్తింపు పత్రాలను వీసీ అందజేశారు.
కూరగాయల సాగులో మానవ ప్రమేయాన్ని తగ్గించి, రైతులకు సాంకేతిక సహాయం అందించేందుకు ఇంజనీరింగ్ విద్యార్థులు రూపొందించిన రోబోను ఈ సందర్భంగా లాంచ్ చేశారు. అనంతరం వీసీ జానయ్య మాట్లాడుతూ.. వ్యవసాయంలో మానవ రహిత లక్ష్య సాధనలో తొలి అడుగుగా రోబో నిలిచిందని అభివర్ణించారు. రాష్ట్రంలో అగ్రిస్టార్టప్స్, అగ్రి ఇండస్ట్రీ లను పెద్ద ఎత్తున ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
ఇప్పటివరకు నాబార్డ్ సహకారంతో దాదాపు150 స్టార్టప్లకు అగ్రి హబ్ ద్వారా సహకారాలు అందించినట్టు చెప్పారు. గ్రామీణ యువత, అభ్యుదయ రైతులకు చేయూతనిచ్చే కార్యక్రమంలో భాగంగా నాబార్డ్ ఆర్థిక సహకారంతో ఆరుగురికి సాయం అందించినట్టు పేర్కొన్నారు. రెండు స్టార్టప్ లకు ఒక్కొదానికి రూ.40 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని అగ్రివర్సిటీ అగ్రి హబ్ ద్వారా అందజేశారు.
ఈ కార్యక్రమంలో నాబార్డ్ డీజీఎం దీప్తి, వీహబ్ ప్రతినిధి సీత, అగ్రివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ జీఈసీహెచ్విద్యాసాగర్, అగ్రిహబ్ ఎండీ జి. వెంకటేశ్వర్లు, వివిధ స్టార్టప్సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.