ఆకాశంలో కనిపించనున్న అరుదైన దృశ్యం

ఆకాశంలో కనిపించనున్న అరుదైన దృశ్యం

హైదరాబాద్, వెలుగు: ఆకాశంలో గురువారం అరుదైన దృశ్యం కనిపించనుంది. ఒకే కక్ష్యలోకి మూడు గ్రహాలు రానున్నాయి. ఉదయం 11:20 నిమిషాలకు భూమి, కుజుడు, సూర్యుడు ఒకే కక్ష్యలోకి రానున్నారు. ప్రతి 26 నెలలకు ఒకసారి ఇలా ఈ మూడు ఒకే కక్ష్యలోకి వస్తాయి. కుజ గ్రహం ఇప్పుడున్నంత కాంతివంతంగా మళ్లీ 2031 వరకు కనిపించదు. సాయంత్రం ఆకాశంలో తూర్పు దిక్కున చూస్తే నక్షత్రంలా కాకుండా స్థిరకాంతితో ఒక ఎర్రటి ఆబ్జెక్ట్ రూపంలో ఈ గ్రహం  కనిపిస్తుంది. 

ఎలాంటి ఆబ్జెక్ట్స్ లేకుండానే కళ్లతో దీన్ని చూడొచ్చు. పిల్లలు ఈ గ్రహాన్ని వీక్షించేందుకు బోయిన్ పల్లిలోని సెయింట్ ఆండ్రూస్ స్కూల్‌లో ప్రత్యేక టెలిస్కోప్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్లానిటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ రఘునందన్ కుమార్ తెలిపారు. దీన్ని ఇస్రో డైరెక్టర్ ప్రకాశ్ చౌహాన్ ప్రారంభించనున్నారు.