పులులు గుంపుగా వస్తే.. అద్భుతమైన వీడియో

పులులు గుంపుగా వస్తే.. అద్భుతమైన వీడియో

వన్య ప్రాణుల్ని మనం సినిమాల్లో, టీవీలో చూస్తేనే అబ్బా అనుకుంటాం. నేషనల్ జియోగ్రాఫిక్, ఏనిమల్ ప్లానెట్ వంటి ఛానల్స్‌లో వైల్డ్ లైఫ్ యానిమల్స్ గురించి అనేక రకాల డాక్యుమెంటరీలు తీస్తుంటాయి. అయితే అడవిలోవెళ్లిన వారికి పులి ఎదురయితే.. అదీ ఒకటి కాదు రెండు కాదు... ఏకంగా ఆరు పులులు గుంపుగా కనిపిస్తే.. నిజంగా ఇది చాలా అరుదైన... అపురూపమైన దృశ్యం అని చెప్పొచ్చు. సరిగ్గా ఇలాంటి అనుభూతే.. ఓ అభయారణ్యంలోకి వెళ్లిన వారికి ఎదురయ్యింది. ఈ ఘటన మహారాష్ట్ర నాగ్ పూర్ సమీపంలోని  ఉమ్రేద్-కర్హండ్ల వన్యప్రాణుల అభయారణ్యంలో చోటు చేసుకుంది. ఆరు పులులు కలిసి ఒక్కసారిగా నడిచే అరుదైన ఈ వీడియో ఇంటర్నెట్‌‌ను షేక్ చేసింది. దీనికి సంబంధించిన వీడియోను బాలీవుడ్ నటుడు రణదీప్ హుడా సోషల్ మీడియాలో పోస్టు చేశారు. 

ఈ వీడియోలో ఆరు పులులు నడుస్తూ ఉండగా ముందు వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు వాటిని సెల్ ఫోన్లో వీడియో తీస్తూ అనుసరించారు. అయితే పులులు నడుస్తుండగా వెనుక వైపున ఓ జీపు రావడంతో అందులో ఉన్న ఓ పులి అడవిలోపలికి వెళ్లిపోయింది. ఆ తర్వాత దారి మధ్యలో ఆటలాడుకుంటూ పులులు నెమ్మదిగా నడుస్తూ వస్తున్నాయి. అయితే ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసిన రణదీప్ హుడా "చప్పర్ ఫాడ్ కే" అనే ట్యాగ్ లైన్ పెట్టాడు. హిందీలో ఎక్కువగా ఈ పదాన్ని ఉపయోగిస్తుంటారు. ఊహించని విధంగా పెద్ద పరిమాణాన్ని సూచించడానికి చప్పర్ పాడ్ కే అనే పదాన్ని యూజ్ చేస్తుంటారు. తనకు వాట్సాప్ ద్వారా ఈ క్లిప్ అందిందని రణదీప్ చెప్పాడు.

అయితే రణదీప్ పెట్టిన ఈ వీడియో వైరల్ అయ్యింది. దీనిపై అనేకమంది నెటిజన్స్ కూడా స్పందించారు.  సీనియర్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి రమేష్ పాండే స్పందిస్తూ.. పులులు ఒంటరి జంతువులు అన్నారు.అయితే అవి ఓ గుంపుగా ఉండవని.. అలాంటిది పులులు ఇలా ఒక్కటిగా రావడం మరింత ప్రత్యేకంగా ఉందని పేర్కొన్నారు. ఇది నిజంగా ఆసక్తికరమైన విషయం" అని ఆయన ట్విటర్‌లో రాశారు. అయితే, అరుదుగా,  పులులు గుంపులుగా కనిపించడం జరుగుతుందన్నారు పాండే ప్రకారం. గతంలో పన్నా,పెంచ్, దుధ్వా ప్రాంతాల్లో ఐదు పులులు గుంపులుగా కనిపించడం గుర్తించామన్నారు. కానీ ఆరు పులులు కలిసి కనిపించడం నిజంగా నమ్మశక్యం కానిది" అని ఆయన అన్నారు.