
మందు కనబడితే చాలు.. మద్యం బాబులు తాగాలని కోరిక కలుగుతుంది. ఎంచక్కా కొనుక్కుని తాగుతున్నప్పుడు చివరకు బాటిల్ లో ఉండే డ్రాప్స్ (లక్కీ డ్రాప్స్)ను కొంతమంది వదలరు. ఒక్క చుక్క కూడా వెస్ట్ చేయరు. అది మందుకున్న పవరేమో. మొత్తానికైతే చుక్క మందు కూడా వృథా చేయరు. మరి నిజంగానే మందే రోడ్డుపై వరదలా పారుతుంటే.. మందు బాబులకు ఆ దృశ్యాలను చూపిస్తే వారి పరిస్థితి ఏంటి..? ప్రాణం కొట్టుకుంటుంది కదా..అవును.. పోర్చుగల్ లో వైన్ వరదల కొట్టుకువచ్చింది వీధుల గుండా.
?? | A river of red wine flooded the streets of São Lourenco do Bairro in Levira, Portugal after the 2.2 million liter tanks at the Levira Distillery gave way on Sunday. The spill was so massive that local officials activated an environmental alert and were forced to divert the… pic.twitter.com/hN9yQq75Ur
— Shadab Javed (@JShadab1) September 11, 2023
పోర్చుగీస్ పట్టణంలోని సావో లోరెంకో డి బైరోలో ఆదివారం (సెప్టెంబర్ 10న) రోజు వీధుల గుండా రెడ్ వైన్ నదిలా ప్రవహిస్తూ కనిపించింది. నది ఉప్పొంగితే వరద బీభత్సం ఎలా ఉంటోందో.. ఆ తరహాలో వీధుల గుండా రెడ్ వైన్ వేగంగా ప్రవహించింది.
రెండు మిలియన్ లీటర్లకు పైగా రెడ్ వైన్ బారెల్స్‌ను మోసుకెళ్లే ట్యాంకులు అనుకోకుండా పగిలిపోవడంతో ఈ ఘటన జరిగిందని అధికారులు వెల్లడించారు. ఈ షాకింగ్ ఘటన గురించి తెలుసుకున్న అధికారులు అప్రమత్తమై అగ్నిమాపక విభాగాన్ని రంగంలోకి దింపారు.
అగ్నిమాపక సిబ్బంది వైన్‌నదిలా ఉగ్రరూపం దాల్చిన ఈ స్టెరిమా నది ప్రవాహాన్ని దారిమళ్లించి సమీపంలోని పోలాల్లోకి వెళ్లేలా చేశారు. అధికారులు ఈ అనుహ్య ఘటనకు ప్రజలకు క్షమాపణలు తెలిపారు. వీధుల గుండా రెడ్ వైన్ ప్రవహిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి.
కొండపై నుంచి రెడ్ వైన్ వేగంగా ప్రవహిస్తూ కనిపించింది. ఈ పట్టణంలో దాదాపు 2 వేల మంది జనాభా ఉంటారు. ఒలింపిక్స్ లో ఉండే స్విమ్మింగ్ పూల్స్ ను నింపేంత రెడ్ వైన్ ప్రవాహం కనిపించింది. వీధుల గుండా ప్రవహించిన రెడ్ వైన్ ను.. దగ్గరలోని పంట పొలాల్లోకి చేర్చారు.