1,153 మంది ఎన్నికల సిబ్బందికి షోకాజ్

1,153 మంది ఎన్నికల సిబ్బందికి షోకాజ్

హైదరాబాద్, వెలుగు :  ఎన్నికల విధులపై ఇస్తున్న శిక్షణకు గైర్హాజరైన సిబ్బందికి హైదరాబాద్​జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్​ రోనాల్డ్​రోస్ షోకాస్​ నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్ జిల్లాలోని పీఓ, ఏపీఓలకు 15 కేంద్రాల్లో రెండు రోజులు ఎన్నికల శిక్షణ ఇస్తున్నారు. సోమవారం ప్రారంభమైన క్లాసులకు 6 వేల మందిలో 1,153 మంది గైర్హాజరయ్యారు. స్పందించిన కమిషనర్ ​షోకాజ్ ​నోటీసులు జారీ చేశారు. అలాగే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎన్నికల విధుల్లో అలసత్వం వహిస్తే సీరియస్​ యాక్షన్​ఉంటుందని హెచ్చరించారు.