స్టార్క్ బౌలింగ్లో సిక్స్..స్టేడియం బయట పడ్డ బాల్

స్టార్క్ బౌలింగ్లో సిక్స్..స్టేడియం బయట పడ్డ బాల్

గాలేలో  ఆస్ట్రేలియాతో జరుగుతున్న  రెండో టెస్టులో శ్రీలంక ఆటగాడు  దినేష్ చండిమాల్ డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. ఇతనితో పాటు కెప్టెన్ కరుణ రత్నే, కుశాల్ మెండిస్, మాథ్యూస్, కమిందు మెండిస్ హాఫ్ సెంచరీలు సాధించడంతో  తొలి ఇన్నింగ్స్ లో 554 పరుగులు చేయగలిగింది. దీంతో ఆసీస్ పై లంక 190 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది.  ఇక నాలుగో రోజు మధ్యాహ్నం సెషన్ అయిపోయాక బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. కేవలం 41ఓవర్లలో 151పరుగులు చేసి ఆలౌటై పరాజయం పాలయింది.

చండిమాల్ షో..
రెండో టెస్టులో చండిమాల్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. 326 బంతుల్లో  5 సిక్సులు, 16 ఫోర్లతో 206 పరుగులు సాధించాడు. టెస్టుల్లో అతనికిది 13వ సెంచరీ. ఇక క్రీజుల్లో ఉన్నంత సేపు చండిమాల్ ప్రేక్షకలను అలరించాడు. సిక్సులు ఫోర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. ముఖ్యంగా స్టార్క్ బౌలింగ్లో మిడ్-వికెట్‌పై కొట్టిన సిక్స్  హైలెట్.  178 ఓవర్లలో రెండో బాల్ ను చండిమాల్ సిక్స్ గా మలిచాడు. ఇది కాస్త స్టేడియం అవతల పడింది.  అదే టైంలో స్టేడియం  బయట  రోడ్డుపై నడచుకుంటూ నలుగురు కుర్రాళ్లు వెళ్తున్నారు. వారిలో ఓ వ్యక్తికి బాల్ తాకింది. స్టేడియం  పై నుంచి బంతి వస్తుండగా దీన్ని గమనించిన కుర్రాడు..అడ్డుకోవాలని చూశాడు. కానీ కాలికి తాకింది. 

ఆ  తర్వాత బంతిని కూడా  చండిమాల్ సిక్సర్ బాది డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతని అద్భుతమైన డబుల్ సెంచరీని..ప్రేక్షకులు, ఇతర క్రికెటర్లు అభినందించారు.