నాలుగో టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు స్లో వికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌!

నాలుగో టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు స్లో వికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌!

రాంచీ :  ఇండియా, ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మధ్య శుక్రవారం మొదలయ్యే నాలుగో టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రాంచీలో స్లో వికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రూపొందిస్తున్నారు. ఇప్పటి వరకు రాంచీ రెండు టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు ఆతిథ్యమిచ్చింది. 2017లో ఆస్ట్రేలియాతో జరిగిన ఓ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను డ్రా చేసుకున్న ఇండియా 2019లో సౌతాఫ్రికాను ఓడించింది. అయితే రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కోట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే ఈ పిచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాలా భిన్నంగా ఉంది. ఈ వికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తక్కువ ఎత్తుతో పాటు నెమ్మదిగా కదులుతుంది. బ్యాటర్ల టెక్నిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పెద్ద పరీక్ష కానుంది. స్పిన్నర్లకు మాత్రం సహజమైన టర్న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లభించే చాన్సుంది.  

ప్రస్తుతానికి పిచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై కాస్త పచ్చిక ఉన్నా మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ముందు తొలగించే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇండియా నలుగురు స్పిన్నర్లను ఆడించినా ఆశ్చర్యం లేదు. ఇక 5 మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 2–1 లీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న టీమిండియా ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. బుమ్రా, రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేకపోవడంతో మిగతా ఆటగాళ్లు బుధవారం ఫుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాక్టీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. ముందుగా కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోహిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సర్ఫరాజ్, దేవదత్ పడిక్కల్, జడేజా   నెట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చెమటోడ్చగా, అక్షర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పటేల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాక్టీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశాడు. సిరాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కేఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భరత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ముకేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డ్రిల్స్ తర్వాత బౌలింగ్‌కు వచ్చారు.  గ్రౌండ్ లోకి రాగానే వికెట్‌‌ ను పరిశీలించిన కోచ్ ద్రవిడ్.. జడేజాకు పలు సూచనలు ఇస్తూ కనిపించాడు. మరోవైపు ఇంగ్లండ్ ప్లేయర్లు కూడా గ్రౌండ్‌‌లో చెమటోడ్చారు. కెప్టెన్  బెన్ స్టోక్స్‌‌  నెట్స్‌‌లో బౌలింగ్‌‌ ప్రాక్టీస్ చేశాడు.