కరోనా వల్ల స్కూళ్లు తెరుచుకోలేదు. ఆన్ లైన్ పాఠాలే నడుస్తున్నాయి. కానీ చత్తీస్‌గఢ్ లోని కొరియా జిల్లాలో చాలా మంది పేద స్టూడెంట్లు స్మార్ట్ ఫోన్లు, టీవీలు లేక పాఠాలు వినలేక పోతున్నారు. అలాంటి వాళ్లకు ఎట్లా గైనా క్లాసులు వినిపించాలనుకున్నాడు ఆ జిల్లాలో పని చేసే టీచర్ అశోక్ లోధీ. బైక్ పై టీవీ పెట్టుకొని స్టూడెంట్ల దగ్గరకెళ్లి పాఠాలు చూపిస్తానని ఆయన పని చేసే స్కూలు మేనేజ్ మెంట్ కు చెప్పాడు. వాళ్లు కూడా ఓకే చెప్పడంతో స్కూల్‌కు చెందిన ఓ టీవీని, మైక్ ను బైక్ కు సెట్ చేసుకొని ఊరూరా తిరుగుతూ పిల్లలకు పాఠాలు చూపిస్తున్నాడు. ఇంత మంచి పని చేస్తున్న లోధీని పిల్లలు ‘సినిమా వాలే బాబూ’ అని ముద్దుగా పిలుచుకుంటున్నారు.

