యాదాద్రి జిల్లాలో బయటపడ్డ వెయ్యేళ్ళ నాటి శాసనాలు

యాదాద్రి జిల్లాలో బయటపడ్డ వెయ్యేళ్ళ నాటి శాసనాలు
యాదాద్రి భువనగిరి జిల్లా : యాదగిరిగుట్ట మండలం సైదాపురంలో వెయ్యేళ్ళ నాటి శాసనాలు వెలుగు చూశాయి. ఆయుర్వేద సర్జన్ అగ్గలయ్యకు చెందిన శాసనాలు బయటపడటంతో… కేంద్ర వైద్య విజ్ఞాన పరిశోధకుల బృందం సైదాపూర్ లో పర్యటించింది.  ఆయుర్వేద డాక్టర్ అగ్గలయ్య ఆపరేషన్లకు సంబంధించిన శాసనాలను వాళ్ళు పరిశీలించారు.  దాదాపు 20 అడుగుల రాతి స్తంభంపై చెక్కిన రాతల ఆధారంగా అగ్గలయ్య శస్త్ర చికిత్సలు చేసినట్టు 30యేళ్ళ క్రితం పరబ్రహ్మ శాస్త్రి అనే శాస్త్రవేత్త గుర్తించి… ఓ జర్నల్ తన వ్యాసాన్ని ప్రచురించారు.  11వ శతాబ్దంలో చాళుక్యుల కాలంలో ఈ ఆయుర్వేద వైద్య అగ్గలయ్య శస్త్ర చికిత్సలు చేసినట్టు రాతిపై చెక్కిన శాసనాల ద్వారా తెలుస్తోందన్నారు.