
రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆమనగల్ లోని శ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారిపై కారు, RTC బస్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. కల్వకుర్తి నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు, హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తున్న ఆర్టీసీ బస్సు..ఎదురెదురుగా ఢీకొనడంతో పెను ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయ్యింది. ముగ్గురి మృతదేహాలు కారులోనే ఇరుక్కొనిపోయాయి.
స్థానికులు ప్రమాదంపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. జేసీబీల సహాయంతో మృతదేహాలను బయటకు తీశారు. కల్వకుర్తి ప్రభుత్వ హాస్పిటల్ కు మృతదేహాలను తరలించారు. మృతులు హైదరాబాద్ లోని హస్తినపురం వాసులుగా గుర్తించారు పోలీసులు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.