సాఫ్ట్​వేర్ జాబ్​ మానేసి డ్రగ్స్ దందా

సాఫ్ట్​వేర్ జాబ్​ మానేసి డ్రగ్స్ దందా
  • లగ్జరీ లైఫ్, వీకెండ్ పార్టీలు, గోవా ట్రిప్స్
  • బానిస అయి పెడ్లర్‌‌‌‌‌‌‌‌గామారిన అనురాధ 
  • వరలక్ష్మి టిఫిన్స్‌‌‌‌, పల్లెటూరు పుల్లట్లు ఓనర్లతో కలిసి దందా
  • పోలీసుల విచారణలో వెలుగులోకి..

హైదరాబాద్‌‌‌‌, వెలుగు:  మహిళ డ్రగ్స్‌‌‌‌ దందా కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. డ్రగ్‌‌‌‌ పెడ్లర్ అనురాధ నెట్‌‌‌‌వర్క్‌‌‌‌ నుంచి పోలీసులు కీలక వివరాలు సేకరించారు. టిఫిన్ సెంటర్ల ఓనర్లు, ఆమె వాట్సాప్‌‌‌‌, స్నాప్‌‌‌‌చాట్స్‌‌‌‌ ఆధారంగా కస్టమర్ల డేటా కలెక్ట్ చేస్తున్నారు. ఈ కేసులో వరలక్ష్మి టిఫిన్‌‌‌‌ సెంటర్ ఓనర్‌‌‌‌ సనికొమ్ము ప్రభాకర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, డ్రగ్స్ సప్లయర్‌‌‌‌‌‌‌‌ అనురాధ, పల్లెటూరు పుల్లట్లు నిర్వాహకుడు శివసాయికుమార్‌‌‌‌‌‌‌‌ను రాజేంద్రనగర్ ఎస్‌‌‌‌వోటీ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ముగ్గురి నుంచి కీలక సమాచారం రాబట్టారు. వీరి డ్రగ్‌‌‌‌ నెట్‌‌‌‌వర్క్‌‌‌‌ను ట్రేస్‌‌‌‌ చేస్తున్నారు. 

లవ్ మ్యారేజ్ చేసుకొని, భర్తకు దూరమై..

కరీంనగర్ జిల్లా గన్నేరుగూడకు చెందిన అనురాధ(34) ఎంబీఏ పూర్తి చేసింది. కొంతకాలం కిందట హైదరాబాద్ వచ్చింది. నానక్‌‌‌‌రాంగూడ టీఎన్‌‌‌‌జీవోస్ కాలనీలో ఉంటూ గచ్చిబౌలిలోని ఓ ప్రముఖ సాఫ్ట్‌‌‌‌వేర్ కంపెనీలో పనిచేసేది. మంచి జీతం, సొంతూరి నుంచి వచ్చే రూ.60 వేల కిరాయి, తండ్రి పెన్షన్‌‌‌‌ రూ.20 వేలు సహా నెలకు దాదాపు రెండు లక్షలు వచ్చేవి. ప్రేమ పెళ్లి చేసుకొని కొంతకాలం తర్వాత భర్తతో విడాకులు తీసుకుంది. వీకెండ్‌‌‌‌ పార్టీలు, పబ్స్‌‌‌‌, గోవా టూర్స్‌‌‌‌కి వెళ్లేది. క్రమంగా చెడు వ్యసనాలు, డ్రగ్స్‌‌‌‌కు బానిసయ్యింది. 

డ్రగ్స్‌‌‌‌ కోసం అనురాధతో దోస్తానా

అనురాధ రెగ్యులర్‌‌‌‌‌‌‌‌గా గోవాకు వెళ్లేది. స్థానిక డ్రగ్ పెడ్లర్ నైజీరియన్‌‌‌‌ జేమ్స్‌‌‌‌ వద్ద కొకైన్‌‌‌‌, ఎండీఎంఏ కొనుగోలు చేసి హైదరాబాద్‌‌‌‌కు ట్రాన్స్‌‌‌‌పోర్ట్ చేసేది. గచ్చిబౌలి, కూకట్‌‌‌‌పల్లి, బంజారాహిల్స్‌‌‌‌ సహా సిటీలోని డ్రగ్స్ కస్టమర్లకు సేల్‌‌‌‌ చేసేది. ఈ క్రమంలోనే వరలక్ష్మి టిఫిన్స్‌‌‌‌ ఓనర్  ప్రభాకర్‌‌‌‌‌‌‌‌రెడ్డితో ఆమెకు పరిచయం ఏర్పడింది. రూ.కోట్ల బిజినెస్ చేస్తున్న ప్రభాకర్‌‌‌‌‌‌‌‌ రెడ్డి అప్పటికే డ్రగ్స్‌‌‌‌కు బానిస అయ్యాడు. అనురాధ నుంచి కూడా డ్రగ్స్ కొనుగోలు చేసేవాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. రాత్రి సమయాల్లో ఇద్దరూ కలిసి హోటల్‌‌‌‌లోనే డ్రగ్స్ తీసుకునేవారు.

ALSO READ:తెలంగాణకి వైరల్ వణుకు ...పేషెంట్లతో నిండిపోతున్న దవాఖాన్లు

టిఫిన్‌‌‌‌ కస్టమర్లు, ఫ్రెండ్స్‌‌‌‌లో డ్రగ్‌‌‌‌ కన్జ్యూమర్లు

వరలక్ష్మీ టిఫిన్స్‌‌‌‌ తరహాలోనే పల్లెటూరు పుల్లట్లు హోటల్‌‌‌‌కు చెందిన వెంకటశివ సాయికుమార్‌‌‌‌‌‌‌‌ను కూడా అనురాధ డ్రగ్స్ దందాలోకి దించింది. ఇద్దరికి అనురాధ రెగ్యులర్‌‌‌‌‌‌‌‌గా డ్రగ్స్ సప్లయ్ చేసేది. టిఫిన్ సెంటర్స్‌‌‌‌లోనే  ఫ్రెండ్స్‌‌‌‌తో కలిసి డ్రగ్స్‌‌‌‌ తీసుకునేవారు. అవసరమైన వారికి సేల్‌‌‌‌ చేసేవారు. ఇలా వచ్చిన డబ్బులో అనురాధ మేజర్ షేర్ తీసుకునేది. ఇలా రెండు టిఫిన్ సెంటర్స్‌‌‌‌కు వచ్చే వారిని కూడా అనురాధ ట్రాప్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రభాకర్‌‌‌‌‌‌‌‌రెడ్డి,శివసాయికుమార్‌‌‌‌‌‌‌‌లను ఫ్రెండ్స్‌‌‌‌ వివరాలు సేకరిస్తున్నారు.ఈ ముగ్గురికి కస్టడీకి తీసుకుని విచారించేందుకు ఏర్పాట్లు చేశారు. గోవాలోని డ్రగ్స్ పెడ్లర్‌‌‌‌‌‌‌‌ జేమ్స్‌‌‌‌ కోసం రెండు స్పెషల్ టీమ్స్‌‌‌‌ గాలిస్తున్నారు.