బేగంపేటలో మహిళ అనుమానాస్పద మృతి.. ఇంపీరియల్ హౌస్ ఎదుట డెడ్బాడీ లభ్యం

బేగంపేటలో మహిళ అనుమానాస్పద మృతి.. ఇంపీరియల్ హౌస్ ఎదుట డెడ్బాడీ లభ్యం

హైదరాబాద్‌‌‌‌ సిటీ, వెలుగు: బేగంపేటలో ఓ మహిళ హత్యకు గురైంది. పంజాగుట్ట పోలీసుల కథనం ప్రకారం.. ఈ నెల 23న ఉదయం 7:20 గంటలకు బేగంపేటలోని ఇంపీరియల్ హౌస్ అపార్ట్‌‌‌‌మెంట్స్‌‌‌‌ ఎదురుగా ఉన్న శ్రీసత్య టిఫిన్ అండ్ మీల్స్ సెంటర్ ఎదుట ఓ మహిళ అపస్మారక స్థితిలో పడి ఉంది. 

స్థానికులు టిఫిన్​సెంటర్​ఎదురుగా టీస్టాల్​నిర్వహిస్తున్న పండుకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్న ఆయన, ఆ మహిళను లిసా అని, ఆమెది అసోం అని గుర్తించాడు. ముఖం, శరీరంపై తీవ్ర గాయాలు ఉండటంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా, పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. అక్కడ ఒక క్వార్టర్‌‌‌‌ మద్యం సీసా, కొంత ఆహారం కనిపించాయి. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు.