
మాదాపూర్, వెలుగు: ఇద్దరూ యువకులే.. వీరిలో ఒకరు డాక్టర్. డేటింగ్యాప్లో పరిచయమయ్యారు. శారీరకంగా కలుద్దామని యువకుడు అడిగితే ఆ డాక్టర్ఒప్పుకోలేదు. దీంతో నువ్వు గే అని మీ తండ్రికి చెప్తానంటూ అతని వద్ద డబ్బులు వసూలు చేస్తున్నాడు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ సాలిపేట గ్రామానికి చెందిన ఓ వ్యక్తి(23) మాదాపూర్‌లోని ఓ హాస్పిటల్లో డాక్టర్‌గా పని చేస్తున్నాడు. ఇతనికి గ్రిండర్యాప్లో ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది.
రెండు వారాల పాటు ఇద్దరూ చాటింగ్చేసుకున్నారు. ఆ తర్వాత కలుద్దామని అనుకున్నారు. దీంతో యువకుడు ఈ నెల 21న ఓయోలో రూమ్ బుక్‌చేసి, డాక్టర్‌కు లొకేషన్పంపించాడు. అతను గదిలోకి వచ్చాక సెక్సువల్‌గా కలుద్దామని యువకుడు ఒత్తిడి తీసుకువచ్చాడు. తనకు ఇష్టం లేదని డాక్టర్ చెప్పడంతో అతన్ని తీవ్రంగా కొట్టాడు. సెక్సువల్‌గా కలవకపోతే నువ్వు గే అని మీ తండ్రికి కాల్ చేసి చెబుతానంటూ బెదిరించాడు.
డబ్బులు డిమాండ్‌చేయడంతో డాక్టర్ రూ.5 వేలు పేటీఎం చేశాడు. తర్వాత మరిన్ని డబ్బులు ఇవ్వాలంటూ ఆ డాక్టర్పని చేస్తున్న హాస్పిటల్‌కు వెళ్లి హంగామా సృష్టించాడు. డాక్టర్ ఫ్లాట్‌కు వెళ్లి మరో రూ.3 వేలు తీసుకున్నాడు. యువకుడి వేధింపులు భరించలేక డాక్టర్ఈ నెల 22న సైబరాబాద్ ఉమెన్‌సేఫ్టీ వింగ్‌లో ఫిర్యాదు చేయగా.. వారు కేసును మాదాపూర్ పోలీసులకు ట్రాన్స్ఫర్ చేశారు. నిందితుడిపై కేసు నమోదు చేసి, గురువారం అరెస్ట్‌చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.