
సోషల్ మీడియాలో పరిచయాలు,ఆ పై ప్రేమ వ్యవహారాలు, ఎఫైర్స్..హత్యలు, ఆత్మహత్యలు.. ఇలా రోజుకో చోట నిత్యం ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటున్నాయి. లేటెస్ట్ గా ఇన్ స్టాగ్రమ్ లో అమ్మాయితో ఏర్పడిన పరిచయం ఓ యువకుడి ప్రాణం తీసింది. అమ్మాయి ప్రేమకు నిరాకరించిందని యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్ లో జరిగింది.
కుత్బుల్లాపూర్ సురారం పీఎస్ పరిదిలోని రాజీవ్ గాంధీ నగర్ లో ఆగస్టు 6న సందీప్(21) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమ విఫలం కావడంతో మనస్తాపానికి గురైన సందీప్ తన రూమ్ లో ఉరేసుకుని ఆత్మహత్యచేసుకున్నాడు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం కోసం డెడ్ బాడీని గాంధీ హాస్పిటల్ కి తరలించారు.