ఒక ఇల్లు ఖాళీ చేయాలంటేనే నానా తిప్పలు పడుతుంటాం. అలాంటిది.. ఇజ్రాయెల్ హెచ్చరికలతో ప్రాణ భయంతో లెబనాన్లో ఊళ్లకు ఊళ్లు ఖాళీ అవుతున్నాయి. బతికుంటే బఠానీలు అమ్ముకునైనా బతకొచ్చని సదరన్ లెబనాన్లో ప్రజలు ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు.
العباسية جنوب لبنان.. النزوح الثاني pic.twitter.com/qjdKa7vzcg
— bintjbeil.org (@bintjbeilnews) March 2, 2026
ఎప్పుడు ఏ మిస్సైల్ వచ్చి మీద పడుతుందోననే భయంతో బతకడం కంటే సురక్షిత ప్రాంతాలకు వెళ్లి ప్రాణాలు నిలుపుకోవడం బెటర్ అని లెబనాన్ ప్రజలు భావిస్తున్నారు. ఫ్యామిలీలకు ఫ్యామిలీలు వందల కార్లతో ఒకేసారి రోడ్డెక్కడంతో ఫుల్ ట్రాఫిక్ జామ్ అయి కార్లు ఎక్కడికక్కడ ఆగిపోయిన పరిస్థితి ఉంది. ఏ స్థాయిలో లెబనాన్ ఖాళీ చేసి వెళ్లిపోతున్నారో ఒక వీడియో కళ్లకు కట్టింది.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలో లెబనాన్లోని హెజ్బొల్లా మిలిటెంట్లు కూడా ఇరాన్కు మద్దతుగా నిలవడంతో యుద్ధం మరింత ముదిరింది. ఇజ్రాయెల్ లక్ష్యంగా హెజ్బొల్లా కూడా ప్రతి దాడులకు దిగడంతో సదరన్ లెబనాన్, ఉత్తర లెబనాన్ లోని 50 గ్రామాల ప్రజలు ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ సూచించింది.
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధంలోకి లెబనాన్ ఎంట్రీ ఇచ్చింది. ఖమేనీ మృతికి ప్రతీకారంగా ఇజ్రాయెల్పై హెజ్బొల్లా గ్రూప్ దాడి చేసింది. నార్త్ ఇజ్రాయెల్లోని హైఫా టార్గెట్గా హిజ్బుల్లా తీవ్రవాదులు దాడులు చేశారు. ప్రతీకారంగా లెబనాన్ రాజధాని బీరూట్పై ఇజ్రాయెల్ కూడా దాడి చేసింది. సౌత్ లెబనాన్లో హిజ్బుల్లా తీవ్రవాదులే లక్ష్యంగా అటాక్ చేసింది. ఇజ్రాయెల్ దాడుల్లో లెబనాన్ లో 30 మందికి పైగా చనిపోయారు.
