లేడీస్ హాస్టల్ లోకి చొరబడ్డ యువకుడు.. అమ్మాయిల కేకలు

లేడీస్ హాస్టల్ లోకి చొరబడ్డ యువకుడు.. అమ్మాయిల కేకలు

రంగారెడ్డి జిల్లా: ఉమెన్స్ హాస్టల్ లోకి చొరబడ్డ ఓ యువకుడిని పోలీసులకు అప్పగించారు హాస్టల్ అమ్మాయిలు. తాము బట్టలు మార్చుకుంటుండగా హాస్టల్ లోకి చొరబడ్డ యువకుడు దొంగచాటుగా చూస్తున్నాడని చెప్పుకొచ్చారు. ఈ సంఘటన శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి జరుగగా స్ధానికంగా కలకలం రేపింది. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని మధురానగర్ లో అమ్మ అనే లేడీస్ హస్టల్ ఉంది. అయితే నల్గోండ జిల్లా, చిట్యాలకు చెందిన పటాన్ ఇమ్రాన్ ఖాన్ అనే యువకుడు కారు డ్రైవర్ గా పనిచేస్తూ అమ్మ లేడీస్ హాస్టల్ పక్కనే నివాసం ఉంటున్నాడు.

సోమవారం రాత్రి హస్టల్ లో యువతులు బట్టలు మార్చుకుంటుండగా ఇమ్రాన్ హాస్టల్ లోకి చొరబడి చూశాడు. గమనించిన యువతులు కేకలు పెట్టారు. వెంటనే కేకలు విన్న ఇమ్రాన్ అక్కడ నుండి పరారయ్యాడు. హాస్టల్ అమ్మాయిలు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో..స్థానిక ఆర్జీఐఏ పొలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం ప్రత్యేక టీం ఏర్పాటు చేసిన పోలీసులు.. సీసీ ఫుటేజ్ అధారంగా ఇమ్రాన్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టామన్నారు. శంషాబాద్ పట్టణంలోని హాస్టల్ యజమానులు.. హాస్టల్ ఆవరణలో ఖచ్చితంగా సీసీ కెమారాలతో పాటు వాచ్ మెన్ ను ఏర్పాటు చేసుకొవాలని సూచించారు పోలీసులు.