
కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ సెప్టెంబర్ 27.
పోస్టుల సంఖ్య: 976.
పోస్టులు: జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఆర్కిటెక్చర్) 11, జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇంజినీరింగ్ – సివిల్) 199, జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇంజినీరింగ్– ఎలక్ట్రికల్) 208, జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎలక్ట్రానిక్స్) 527, జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) 31.
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బి.ఆర్కిటెక్చర్, బి.టెక్/ బీఈ, ఎంసీఏలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 27 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్లు ప్రారంభం: ఆగస్టు 28.
లాస్ట్ డేట్: సెప్టెంబర్ 27.
అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మహిళలు, ఏఏఐలో ఏడాది అప్రెంటీస్ పూర్తి చేసిన అభ్యర్థులకు ఫీజు లేదు. ఇతరులకు రూ.300.
సెలెక్షన్ ప్రాసెస్: 2023, 2024, 2025 గేట్ స్కోర్, అప్లికేషన్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు www.aai.aero వెబ్సైట్లో సంప్రదించగలరు.