- ఆమ్ ఆద్మీ పార్టీ విమర్శ
ట్యాంక్ బండ్, వెలుగు: అభివృద్ధి కంటే హంగు, ఆర్భాటాల ప్రచారం కోసమే హైదరాబాద్లో ప్రధాని మోదీ పర్యటన కొనసాగిందని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ హేమా సుదర్శన్ జిల్లోజు విమర్శించారు. సోమవారం లిబర్టీలోని పార్టీ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ.. మోదీ ప్రసంగం అంతా అబద్ధాల మయమని, సీఎం రేవంత్ రెడ్డిని బీజేపీలో చేర్చుకోవడానికే ఆయన ప్రాధాన్యతనిచ్చినట్లు కనిపిస్తోందని ఎద్దేవా చేశారు.
గత పదేండ్లుగా తెలంగాణను విస్మరించిన కేంద్ర ప్రభుత్వం.. విభజన హామీలైన బయ్యారం ఉక్కు పరిశ్రమ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలను తుంగలో తొక్కి ఇప్పుడు ఎన్నికల వేళ అబద్ధపు హామీలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని మండిపడ్డారు. సమావేశంలో నాయకులు జావిద్, కొడంగల్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
