నాలుగో రోజూ ఆరోగ్య శ్రీ సేవలు బంద్

నాలుగో రోజూ ఆరోగ్య శ్రీ సేవలు బంద్

ఆరోగ్య  శ్రీ  సేవల  బంద్….  నాలుగో  రోజుకు  చేరుకోవటంతో  రోగులు  తీవ్ర  ఇబ్బందులు  పడుతున్నారు.  టైంకు  సరైన  వైద్యం  అందక  సర్కార్  హాస్పిటల్స్  ముందు  పడిగాపులు  కాస్తున్నారు.  అయితే  బకాయిల  లెక్కపై  సర్కార్,   ప్రైవేట్   హాస్పిటల్స్   మధ్య   భిన్నాభిప్రాయాలున్నాయి.   పెండింగ్   బిల్లులన్నీ  చెల్లిస్తేనే… సేవలు  మొదలు  పెడతామని  చెబుతున్నాయి  నెట్  వర్క్ హాస్పిటల్స్..  ఎమర్జెన్సీ  సేవలు  కూడా  అందకపోవడంతో  ఇబ్బందులు  పడుతున్నారు  రోగులు.