అచ్చం సమంత లాగే ఉన్న ఈ హీరోయిన్ ఎవరంటే..

అచ్చం సమంత లాగే ఉన్న ఈ హీరోయిన్ ఎవరంటే..

హైదరాబాద్‌: మనుషుల్ని పోలిన మనుషులు ఉంటారని చాలా సార్లు వినే  వింటారు అందరూ. కొన్ని సందర్భాల్లో ఆ మాట నిజమే అన్నట్లు కొన్ని సాక్ష్యాలు టీవీల్లోనూ, పేపర్లలోనూ చూసే ఉంటాం. ఇక అలాంటి వారు మనకి బాగా తెలిసిన సెలబ్రిటీలే అయి ఉంటే, అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో రచ్చ చేస్తాయి.

అచ్చం హీరోయిన్ సమంత లాగే ఉన్న ఓ అమ్మడి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలను చూసిన నెటిజన్లు ‘సమంత లాగే ఏంటి? సమంతే కదా’ అని పొరపాటు పడుతున్నారు. కానీ ఆ తర్వాత నిజం తెలుసుకొని ఆశ్చర్యపోతున్నారు.  కోలీవుడ్ కు చెందిన ఆత్మికా అనే హీరోయిన్ ఇటీవల  తన ఫొటోషూట్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఆ ఫొటోలు చూసిన చాలామంది నెటిజన్లు..  తమ కళ్లను తామే నమ్మలేకపోతున్నామని,  కొన్ని యాంగిల్స్‌లో ఈ హీరోయిన్ అచ్చం సమంతలాగా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. కానీ కోలీవుడ్ అయినా, టాలీవుడ్ అయినా హీరోయిన్ గా  ఎదగాలంటే గ్లామర్ ఒక్కటే సరిపోదు కదా.