వేసవి వేడి పెరుగుతున్న వేళ, సినీ ప్రియులకు చల్లని వినోదాన్ని పంచేందుకు అటు థియేటర్లు, ఇటు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు సిద్ధమయ్యాయి. ఈ వారం బాక్సాఫీస్ వద్ద క్రేజీ ప్రాజెక్టులు పోటీ పడుతుండగా, డిజిటల్ స్క్రీన్స్‌పై ఏకంగా 14 కొత్త సినిమాలు, సిరీస్‌లు సందడి చేయనున్నాయి. యాక్షన్, రొమాన్స్, థ్రిల్లర్.. ఇలా అన్ని జానర్లలోనూ కంటెంట్ అందుబాటులో ఉండటంతో ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారంటీగా ఈ వారం మారింది.
థియేటర్ల వద్ద 'డెకాయిట్' హంగామా!
ఈ వారం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద అందరి దృష్టి అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ‘డెకాయిట్’ పైనే ఉంది. దాదాపు నాలుగేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అడివి శేష్ నుంచి వస్తున్న సినిమా ఇది. రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి షానిల్ డియో దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 10న విడుదల కానున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, సునీల్, అనురాగ్ కశ్యప్ వంటి హేమాహేమీలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. శేష్ మార్క్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఏ స్థాయిలో ఉంటాయో చూడాలి.
కోలీవుడ్, మాలీవుడ్ నుంచి గట్టి పోటీ!
అదే రోజున తమిళం నుంచి ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి జంటగా నటించిన ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ (LIK) విడుదలవుతోంది. విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఒక వినూత్నమైన రొమాంటిక్ కామెడీగా ప్రచార చిత్రాల ద్వారా ఆకట్టుకుంది. ఎస్.జె. సూర్య, యోగి బాబు కామెడీ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ కానుంది. ఇక మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘పళ్లిచట్టంబి’ కూడా ఏప్రిల్ 10నే పలు భాషల్లో థియేటర్లలోకి రానుంది. డిజో జోస్ ఆంటోని దర్శకత్వంలో హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లతో ఈ సినిమా రూపొందింది.
ఓటీటీలో వినోదాల విందు
థియేటర్లకు వెళ్లలేని వారి కోసం ఓటీటీలో విభిన్న భాషల సినిమాలు, వెబ్ సిరీస్‌లు క్యూ కట్టాయి. దాదాపు 14 కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రెడీ అయ్యాయి. ముఖ్యంగా 'ద బాయ్స్' వంటి పాపులర్ సిరీస్‌లు తెలుగు డబ్బింగ్‌తో అందుబాటులోకి వస్తుండటం విశేషం.
అమెజాన్ ప్రైమ్ వీడియో:
సూపర్ హీరోల వెర్రి వేషాల నేపథ్యంలో సాగే ఈ పాపులర్ సిరీస్ 'ద బాయ్స్ సీజన్ 5' ఏప్రిల్ 8 నుంచి తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుంది.
క్యాండీ అండ్ ది పిజ్జా గర్ల్ హిందీ మూవీ ఏప్రిల్ 10వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది..
నెట్‌ఫ్లిక్స్:
అవార్డ్ విన్నింగ్ సిరీస్ సెకండ్ పార్ట్ 'బీఫ్ సీజన్ 2 'ఏప్రిల్ 8 తేదీ నుంచి స్ట్రీమింగ్ కు రెడీ అయ్యింది.
బిగ్ మిస్టేక్స్: ఇంగ్లీష్ సిరీస్ ( ఏప్రిల్ 9).
18th రోజ్: ఫిలిప్పినో డ్రామా (ఏప్రిల్ 9).
తు యా మై: హిందీ సినిమా (ఏప్రిల్ 10).
త్రాష్: ఇంగ్లీష్ మూవీ (ఏప్రిల్ 10).
జియోహాట్‌స్టార్:
రాధిక శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన 'తాయ్ కిళవి' తెలుగు డబ్బింగ్ మూవీపై ఆసక్తి నెలకొంది . ఇది ఏప్రిల్ 10వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కు సిద్ధమయ్యింది. తక్కువ బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్లకు పైగా రాబట్టింది.
సన్ నెక్స్ట్:
మలయాళ థ్రిల్లర్ హాళ్ ఏప్రిల్ 10న, అదే రోజు మరో మలయాళ చిత్రం కనిమంగళం కొవిలకమ్ కూడా స్ట్రీమింగ్ కు సిద్ధమయ్యాయి.
ఇతర ఓటీటీలలో..
ఖాకీ సర్కస్: తమిళ సిరీస్ జీ5 లో - ఏప్రిల్ 10 నుంచి స్ట్రీమింగ్ కానుంది. లయన్స్ గేట్ ప్లే లో వైల్డ్ క్యాట్ తెలుగు డబ్బింగ్ మూవీ, ఔట్‌కమ్ హాలీవుడ్ మూవీ యాపిల్ టీవీ ప్లస్ లో, అదే విధంగా మరాఠీ డ్రామా తో తీ అని ఫుజీ మూవీ సోనీ లివ్ వంటి చిత్రాలు, వెబ్ సిరీస్ లు - ఏప్రిల్ 10వ తేదీ నుంచి ఓటీటీలో రిలీజ్ కు రెడీ అయ్యాయి. మొత్తానికి థియేటర్లలో బిగ్ స్క్రీన్ ఎక్స్‌పీరియన్స్ కావాలనుకునే వారికి, ఇంట్లోనే కూర్చుని వెరైటీ కంటెంట్ చూడాలనుకునే వారికి ఈ వారం అదిరిపోయే ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.
