Manoj Tiwary: టీ20 వరల్డ్‌కప్ 2026 సేమీ-ఫైనల్స్ కి ముందుగా టీమిండియా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటుంది. భారత ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్ లేమితో జట్టుకు భారంగా మారిపోయాడు. అతడు ఇప్పటి వరకు ఆడిన 6 మ్యాచ్‌లలో కేవలం 80 పరుగులు మాత్రమే చేయగా, 3 మ్యాచ్‌లలో జీరో రన్స్ కే పరిమితితం, ఒక్క హాఫ్ సెంచరీ మాత్రమే సాధించడం అతడి ఫామ్ పై అనుమానాలకు తావిస్తుంది. సూపర్– 8 మ్యాచ్‌లో వెస్ట్ ఇండీస్ తో జరిగిన మ్యాచ్‌లో అతను 11 బంతుల్లో కేవలం 10 రన్స్ చేశాడు. టీమ్ విజయం కోసం వచ్చిన మంచి అవకాశాన్ని కూడా ఉపయోగించలేకపోయాడు.
అభిషేక్ శర్మ బ్యాటింగ్ పై మాజీ భారత క్రికెటర్ మనోజ్ తివారి తీవ్రంగా మండిపడ్డాడు. "నువ్వు నీ వికెట్‌కు విలువ ఇవ్వకపోతే, ఇలాంటి నిర్లక్ష్యపు షాట్లు ఆడి మళ్లీ 0, 0, 0కే పరిమితం అవుతావని సూచించాడు. ఇప్పటికైనా నీ మైండ్‌సెట్, షాట్ సెలెక్షన్ పై మంచిగా ప్రాక్టీస్ చేయాలని సూచించాడు. అభిషేక్ చాలా తక్కువ సమయంలోనే స్టార్ అయిపోయాడు.. కానీ నిజమైన సూపర్‌స్టార్ కావాలంటే, జట్టుకు గేమ్ ఛేంజర్ అని నిరూపించుకోవాల్సి ఉటుందని వెల్లడించాడు. జట్టులో చాలా కాంపిటిషన్ ఉంది, చాలా మంది మ్యాచ్ విజేతలు ఉన్నారు.. అభిషేక్ వారిని ముందుకు దాటాల్సి ఉందని చెప్పారు. విండీస్ తో జరిగిన మ్యాచ్ లో అతను రెండు క్యాచ్ లని కూడా వదిలి పెట్టాడని గుర్తు చేశాడు. అభిషేక్ శర్మ తాను ఏ బంతులను హిట్ చేయాలో, ఏ బంతులను డిఫెన్స్ చేయాలో నిర్ణయించుకునే మైండ్‌సెట్‌ను అలవర్చుకోవాలని మనోజ్ తివారి సూచించారు.
భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా అబిషేక్ శర్మ ఫామ్ పై ఆందోళన వ్యక్తం చేశారు. అతను కొన్ని టెక్నికల్ మార్పులు చేయాల్సి ఉందన్నారు. ఒకసారి హాఫ్ సెంచరీ సాధించిన అభిషేక్ బ్యాట్ నునంచి తర్వాత కూడా పరుగులు వస్తాయని అందరూ ఆశించినప్పటికీ, అతను సెలక్ట్ చేసుకున్న షాట్స్ బ్యాక్ నీ ఎక్కువ క్రాస్ చేయడంతో.. మొత్తం బరువు వెనుకకు వెళ్తోంది అన్నాడు. శర్మకి ఫ్రంట్ ఫుట్ పై బరువు ఎక్కువ పెట్టడం సరిగ్గా సరిపోతుంది అని పఠాన్ సూచించాడు. తాజాగా ఫామ్ కోల్పోయినప్పటికీ, అబిషేక్ శర్మ ప్రస్తుతం T20I క్రికెట్లో నెంబర్ వన్ బ్యాటర్ గానే కొనసాగుతున్నారు.
