T20 World Cup: సెమీఫైనల్ పోరుకు సిద్ధమైన భారత్– ఇంగ్లాండ్.. అంపైర్లు వీళ్లే?

T20 World Cup: సెమీఫైనల్ పోరుకు సిద్ధమైన భారత్– ఇంగ్లాండ్.. అంపైర్లు వీళ్లే?

T20 World Cup: టీ20 ప్రపంచకప్ 2026లో నాకౌట్ దశ స్టార్ట్ అయింది. ఇప్పటికే భారత్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్లు సెమీఫైనల్స్‌కు చేరుకున్నాయి.  రేపు (మార్చి 4న) జరగనున్న తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ టీమ్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్  జరగనుంది. ఇక గురువారం (మార్చి 5న) జరగనున్న రెండో సెమీస్ లో భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ జట్లు పోటీ పడనున్నాయి. ఈ మ్యాచ్‌ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనుంది. 

న్యూజిలాండ్ వర్సెస్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగే తొలి సెమీఫైనల్‌కు రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, అలెక్స్ వార్ఫ్ ఆన్-ఫీల్డ్ అంపైర్లుగా ఉండనున్నారు. నితిన్ మీనన్ థర్డ్ అంపైర్‌గా, రాడ్ టక్కర్ ఫోర్త్ అంపైర్‌గా, జవగల్ శ్రీనాథ్ మ్యాచ్ రిఫరీగా ఉండనున్నారు. అలాగే, భారత్– ఇంగ్లాండ్ జట్ల మధ్య వాంఖడే స్టేడియంలో జరిగే రెండో సెమీఫైనల్‌కి క్రిస్ గఫానీ, అల్లాహుద్దీన్ పాలేకర్ ఆన్-ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరించనుండగా, ఆడ్రియన్ హోల్డ్‌స్టాక్ థర్డ్ అంపైర్‌గా, పాల్ రీఫెల్ ఫోర్త్ అంపైర్‌గా, ఆండీ పైక్రాఫ్ట్ మ్యాచ్ రిఫరీగా కొనసాగనున్నారు.  \

►ALSO READ | Sanju Samson: నచ్చిన స్థానంలో సంజు శాంసన్ స్టైలిష్ బ్యాటింగ్.. కొడితే మ్యాచ్ గెలవాల్సిందే! 

తొలి సెమీఫైనల్: సౌతాఫ్రికా vs న్యూజిలాండ్: 
* ఆన్-ఫీల్డ్ అంపైర్లు: రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, అలెక్స్ వార్ఫ్
* థర్డ్ అంపైర్: నితిన్ మీనన్
* ఫోర్త్ అంపైర్: రాడ్ టక్కర్
* మ్యాచ్ రిఫరీ: జవగల్ శ్రీనాథ్

రెండో సెమీఫైనల్: భారత్ vs ఇంగ్లాండ్: 
* ఆన్-ఫీల్డ్ అంపైర్లు: క్రిస్ గఫానీ, అల్లాహుద్దీన్ పాలేకర్
* థర్డ్ అంపైర్: ఆడ్రియన్ హోల్డ్‌స్టాక్
* ఫోర్త్ అంపైర్: పాల్ రీఫెల్
* మ్యాచ్ రిఫరీ: ఆండీ పైక్రాఫ్ట్