అభిషేక్ అదరహో.. 52 బంతుల్లో 148 రన్స్.. పవర్ హిట్టింగ్ చూపెట్టాడుగా..!

అభిషేక్ అదరహో.. 52 బంతుల్లో 148 రన్స్.. పవర్ హిట్టింగ్ చూపెట్టాడుగా..!
  • 12 బాల్స్‌లోనే ఫిఫ్టీ.. ముస్తాక్ అలీ ట్రోఫీలో విధ్వంసం

హైదరాబాద్, వెలుగు: టీమిండియా డ్యాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ (52 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 8 ఫోర్లు, 16  సిక్సర్లతో 148) హైదరాబాద్ గడ్డపై మరోసారి తన పవర్ హిట్టింగ్ చూపెట్టాడు. జింఖానా గ్రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆదివారం జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ గ్రూప్–సి మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పంజాబ్ కెప్టెన్ అభిషేక్ బెంగాల్ బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చీల్చి చెండాడాడు. 12 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఇది మెన్స్ టీ20 క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జాయింట్ థర్డ్ ఫాస్టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫిఫ్టీ. ఏకంగా 16 సిక్సర్లు బాదిన అభి.. డొమెస్టిక్ క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన పునిత్ బిష్త్ (17) తర్వాత రెండో ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిలిచాడు.

అభిషేక్ విజృంభణతో ఈ పోరులో పంజాబ్ 112 రన్స్ తేడాతో బెంగాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చిత్తుగా ఓడించింది. తొలుత ప్రభ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సిమ్రాన్ సింగ్ ( 70)తో కలిసి అభి తొలి వికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 205 రన్స్ జోడించగా పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 310/5 స్కోరు చేసింది. ముస్తాక్ అలీ ట్రోఫీలో ఇది రెండో  అత్యధిక స్కోరు. అనంతరం భారీ టార్గెట్ ఛేజింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో క్రమంలో బెంగాల్ కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ (66 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 13 ఫోర్లు, 8 సిక్సర్లతో 130) సెంచరీతో పోరాడినా బెంగాల్ 20 ఓవర్లలో 198/9 మాత్రమే చేసి ఓడింది. స్పిన్నర్ హర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రీత్ బ్రార్ (4/23) దెబ్బకొట్టాడు. 

హైదరాబాద్ గెలుపు
ముస్తాక్ అలీ ట్రోఫీలో హైదరాబాద్ రెండో విజయం సాధించింది. ప్రజ్ఞయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి (67 నాటౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) మెరుపు బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కతా ఈడెన్ గార్డెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరిగిన గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–బి మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 7 వికెట్ల తేడాతో గోవాను ఓడించింది. తొలుత గోవా 20 ఓవర్లలో 160/4 స్కోరు చేసింది. లలిత్ యాదవ్ (85 నాటౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) ఒక్కడే రాణించాడు. హైదరాబాద్ 14 ఓవర్లలోనే 166/3 స్కోరు చేసి గెలిచింది. అమన్ రావు (40) కూడా రాణించాడు.