నారాయణ కాలేజీ ముందు ఏబీవీపీ విద్యార్థుల ధర్నా

నారాయణ కాలేజీ ముందు ఏబీవీపీ విద్యార్థుల ధర్నా

హైదరాబాద్: మాదాపూర్ లోని నారాయణ విద్యా సంస్థల కార్యాలయాన్ని ఏబీవీపీ విద్యార్థులు ముట్టడించారు.  కాలేజీలో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఏబీవీపీ పిలుపు మేరకు ఇవాళ కార్పొరేట్ కాలేజీల ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ... కార్పొరేట్ కాలేజీల ఆగడాలను అరికట్టాలని, అధిక ఫీజును నియంత్రించాలని డిమాండ్ చేశారు. చదువు పూర్తైన విద్యార్థులను అధిక ఫీజుల పేరుతో సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధిస్తున్నారన్నారు.

విద్యా సంస్థల్లో బుక్స్, డ్రెస్సెస్ వంటివి అమ్మొద్దని ఉన్నప్పటికీ... కాలేజీలు, పాఠశాలలు ఇవేమీ పట్టించుకోవడంలేదని తెలిపారు. ర్యాంకుల పేరుతో విద్యను వ్యాపారం చేశారని మండిపడ్డారు. నారాయణ కాలేజీలో గాయపడిన విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న కాలేజీలను సీజ్ చేయాలని, కాలేజీ హాస్టళ్లలో ప్రమాణాలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.