జేఎన్టీయూలో ఏబీవీపీ విద్యార్థుల ధర్నా

జేఎన్టీయూలో ఏబీవీపీ విద్యార్థుల ధర్నా

జేఎన్టీయూ వర్సిటీ రిజిస్ట్రార్ ఛాంబర్ వద్ద ఏబీవీపీ విద్యార్థులు ధర్నాకు దిగారు. పీజీ ఈసెట్, టీఎస్ ఎంసెట్ 2023 కన్వీనర్లుగా జేఎన్టీయూ  ప్రొఫెసర్ల నియామకాన్ని వ్యతిరేకిస్తూ కొందరు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రికి కంప్లైంట్ చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థులు జేఏసీ పేరుతో యూనివర్సిటీ ప్రతిష్ఠ దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. యూనివర్సిటీతో సంబంధంలేని వ్యక్తులు జేఏసీ పేరుతో కంప్లైంట్ చేయడం ఏంటని విద్యార్థులు ప్రశ్నించారు. ఈ మేరకు ఇంఛార్జ్ రిజిస్ట్రార్ వెంకటేశ్వర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు.

2023 పీజీఈ సెట్ టీఎస్ ఎంసెట్ కన్వీనర్లుగా ఉన్నత విద్యామండలి జేఎన్టీయూ  ప్రొఫెసర్లను నియమించింది. అయితే ఈ నిర్ణయాన్ని యూనివర్సిటీ పీహెచ్డీ స్కాలర్లు వ్యతిరేకిస్తున్నారు. అయితే ఈ వ్యవహారంతో వారికి సంబంధం లేకపోయినా వ్యక్తిగత కారణాలతో కుట్రలు చేస్తున్నారని యూనివర్సిటీ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. వర్సిటీతో సంబంధం లేని వ్యక్తులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.