ఏసీబీకి చిక్కిన కానిస్టేబుల్

V6 Velugu Posted on Dec 04, 2021

చేవెళ్ల, వెలుగు: లంచం తీసుకుంటూ  కానిస్టేబుల్ ఏసీబీకి రెడ్ ​హ్యాండెడ్​గా దొరికిన ఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్  పీఎస్​లో జరిగింది.  మండల పరిధిలోని కుతుబుద్దీన్​ గ్రామానికి చెందిన రహీం ఓ మైనర్ ​ట్రాప్   కేసులో నిందితుడు. పోలీసులు అతడిని అరెస్ట్ చేసినప్పుడు పల్సర్ బైక్ ను సీజ్ చేశారు. జైలు నుంచి  వచ్చిన రహీం వారం కిందట కోర్టు ద్వారా బైక్​ రిలీజ్ ఆర్డర్ తెచ్చుకున్నాడు. అయితే కానిస్టేబుల్ అంజిలయ్య బైక్ ఇవ్వకుండా పీఎస్ ​చుట్టూ తిప్పించుకుంటున్నాడు.  చివరకు పది వేలు లంచం ఇవ్వాలని కానిస్టేబుల్​ డిమాండ్ చేయగా రహీం ఏసీబీ అధికారులకు కంప్లయింట్​ చేశాడు. శుక్రవారం రాత్రి సమయం 7:30 గంటలకు రహీం నుంచి అంజిలయ్య రూ. 10వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిందితుడిని అరెస్ట్​ చేసి రిమాండ్ కు తరలించనున్నట్టు ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు.  

Tagged Crime News, constable arrest, acb arrest constable, moinabad police station

Latest Videos

Subscribe Now

More News