V6 News

ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఏడీఈ 

ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఏడీఈ 

దేవరకొండ, వెలుగు: విద్యుత్​ రిపేర్​ పనులు చేసిన కాంట్రాక్టర్​కు​బిల్లులు చెల్లించేందుకు లంచం డిమాండ్​ చేసిన నల్గొండ జిల్లా దేవరకొండ విద్యుత్​ ఏడీఈ సైదులును ఏసీబీ అధికారులు రెడ్  హ్యాండెడ్‌‌‌‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ జగదీశ్ చందర్  మీడియాకు వివరాలు వెల్లడించారు. దేవరకొండలో వర్షాల వల్ల దెబ్బ తిన్న విద్యుత్  మరమ్మతు పనులకు సంబంధించి రూ.10 లక్షల బిల్లులు పెండింగ్‌‌‌‌లో ఉన్నాయి. ఈ బిల్లులు మంజూరు చేసేందుకు ఏడీఈ సైదులు 3 శాతం కమీషన్  డిమాండ్  చేస్తూ కాంట్రాక్టర్‌‌‌‌ను ఇబ్బంది పెట్టాడు. లంచం ఇవ్వడం ఇష్టం లేని సదరు కాంట్రాక్టర్  ఏసీబీని ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు గురువారం  ఏడీఈకి ఆఫీస్​లో రూ.30 వేలు అందజేయగా, ఏసీబీ ఆఫీసర్లు పట్టుకున్నారు. ఏడీఈని అదుపులోకి తీసుకొని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు.