రూ. 50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ మాదాపూర్ SI వినయ్...

రూ. 50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ మాదాపూర్ SI వినయ్...

హైదరాబాద్ లో మరో అవినీతి తిమింగలం ఏసీబీ అధికారులకు చిక్కింది. మాదాపూర్ పీఎస్లో పనిచేస్తున్న సబ్ ఇన్స్పె క్టర్ వినయ్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికా రులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఓ కేసు విషయంలో సహాయం చేస్తా అని బాధితుడి నుంచి రూ. 50 వేలు లంచం డిమాండ్ చేశాడు. ఎసై వినయ్. దీంతో బాధితుడు ఏసీబీ అధికారు లను ఆశ్రయించాడు. 

పథకం ప్రకారం ఆ మె ఎత్తాన్ని వినయ్ తీసుకుంటూన్న సమయంలో ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. లంచం మొత్తం స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు, వినయన్ను అదుపులోకి తీసుకునివిచారణ చేపట్టారు. 

►ALSO READ | కోరుట్లలో BRS అభ్యర్థి ఇంట్లో దేవుడి వెండి వస్తువులు : ఓటర్లకు ఈ రేంజ్ లో పంపకాలా..!

ఈ వసూళ్లపై ఉన్నతాధి కారులతో లింక్స్ ఉన్నట్లు ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు అవి నీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఏసీబీ అధికారులు హెచ్చరించారు.