రూ. రెండు లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ సీనియర్ అసిస్టెంట్

రూ. రెండు లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ సీనియర్ అసిస్టెంట్

ఆదిలాబాద్ జిల్లా బజరాత్నుర్ ఎమ్మార్వో ఆఫీసులో ఆకస్మిక దాడులు నిర్వహించారు ఏసీబీ అధికారులు. శుక్రవారం ( జనవరి 23 ) నిర్వహించిన ఈ దాడుల్లో రూ. రెండు లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు సీనియర్ అసిస్టెంట్ విద్యాసాగర్ రెడ్డి. సాదాబైమా చేయడానికి  రైతు నుండి  రెండు లక్షలు లంచం డిమాండ్ చేశాడు విద్యాసాగర్ రెడ్డి. ఈ క్రమంలో ఏసీబీని ఆశ్రయించాడు బాధితుడు. 

బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ఎమ్మార్వో ఆఫీసులో దాడులు నిర్వహించి విద్యాసాగర్ రెడ్డిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.బల్పనూర్ శివారులో ఎనిమిది ఏకరాలు పట్టా చేయడం కోసం ఆశ్రయించగా.. విద్యాసాగర్ రెడ్డి లంచం డిమాండ్ చేసాడని తెలిపాడు బాధితుడు.

విద్యాసాగర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. శనివారం విద్యాసాగర్ రెడ్డిని కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నామని తెలిపారు అధికారులు.