హైదరాబాద్: సైబరాబాద్ పోలీస్ కమిషనర్ పరిధిలోని మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. స్టేషన్ ఎస్సై రంజిత్, రైటర్ విక్రమ్ రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుపడ్డారు. ఇద్దరిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న సిబ్బంది అవినీతి వ్యవహారంపై రెండుమూడు రోజులుగా అవినీతి నిరోధక శాఖ అధికారులు నిఘూ పెట్టారు. పక్క ప్లాన్ ప్రకారం దాడులు చేసి ఎస్సై అవినీతి గుట్టురట్టు చేశారు.