ఏపీ మాజీ అడ్వకేట్ జనరల్ పై ఏసీబీ కేసు  

ఏపీ మాజీ అడ్వకేట్ జనరల్ పై ఏసీబీ కేసు  

రాజధాని భూ కుంభకోణంలో పాత్ర ఉందంటూ అభియోగాలు

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ మాజీ అడ్వకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌పై ఏసీబీ కేసు నమోదు చేసింది. రాజధాని భూ కుంభకోణంలో ఆయన పాత్ర ఉందనే అభియోగాలపై కేసు నమోదు చేశారు. దమ్మాలపాటి శ్రీనివాస్‌తో పాటు మరో 12మందిపై  ప్రివెన్షన్‌ కరెప్షన్‌ 409, ఐపీసీ 420 రెడ్‌ విత్‌ 120-B సెక్షన్ల క్రింద కేసు పెట్టారు. అప్పటి సీఎం చంద్రబాబు హయాంలో దమ్మాలపాటి అడ్వొకేట్‌ జనరల్‌గా పనిచేసిన విషయం తెలిసిందే. అధికారిక హోదాలో ఉంటూ అక్రమాలకు పాల్పడ్డట్టు పలు సాక్ష్యాధారాలు లభించాయని ఏసీబీ వర్గాలు చెబుతున్నాయి. 2014లో మామ, బావమరిది పేర్లతో భూములు కొన్న దమ్మాలపాటి 2015, 2016లో అవే భూములు తను, తన భార్య పేర్లపై బదలాయించుకున్నారని ఆరోపణ. భూములు సీఆర్ డీఏ కోర్‌ క్యాపిటల్‌ పరిధిలో ఉండేలా దమ్మాలపాటి కొనుగోలు చేశారని.. ఈ మేరకు ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయంటూ కేసు నమోదు చేసింది ఏసీబీ.