అశ్వారావుపేట, వెలుగు: బ్లాక్ మనీ పేరుతో మోసం చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ సతీశ్ కుమార్ తెలిపారు. మంగళవారం అశ్వారావుపేట స్టేషన్ లో మీడియాకు వివరాలు వెల్లడించారు. ఏపీలోని చేబ్రోలు మండలం ఉంగుటూరు గ్రామానికి చెందిన పత్తిపాటి ప్రేమ్ చంద్
భద్రాద్రికొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పట్టణానికి చెందిన మధుబాబును రూ.13 లక్షలు ఇస్తే రూ.కోటి బ్లాక్ మనీ ఇస్తానని నమ్మించి ముందుగా రూ.11 లక్షలు తీసుకున్నాడు. ఆ తరువాత రసాయనాల కొనుగోలు పేరుతో రూ.2 లక్షలు తీసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు.
నిందితుడిపై నకిలీ కరెన్సీ, వెహికల్స్ చోరీ కేసులో బాచుపల్లి, ఏపీలోని రామచంద్రపురం, కూకటపల్లి పోలీస్ స్టేషన్ లో కేసులు ఉండగా, జైలుకు వెళ్లి వచ్చినట్లు చెప్పారు. నిందితుడి వద్ద రూ.500 నోట్ల సైజులో కట్ చేసిన బ్లాక్ పేపర్స్ కట్టలు, రెండు రసాయనాల బాటిళ్లను స్వాధీనం చేసుకొని, రిమాండ్కు పంపినట్లు తెలిపారు. సీఐ నాగరాజు రెడ్డి, ఎస్సైలు యయాతి రాజు, బెల్ సింగ్ పాల్గొన్నారు.
