యాసిడ్ బాటిళ్లు పగిలి.. విద్యార్థులకు అస్వస్థత

యాసిడ్ బాటిళ్లు పగిలి.. విద్యార్థులకు అస్వస్థత
  • శ్వాస తీసుకోవడంతో ఇబ్బందులు, వాంతులు

జీడిమెట్ల, వెలుగు: చింతల్​లోని ఓ ​స్కూల్​లో శనివారం పలువురు స్టూడెంట్స్ అస్వస్థతకు గురయ్యారు. స్కూల్ మూడో అంతస్తులో సిబ్బంది బాత్​రూమ్​లు శుభ్రం చేస్తుండగా, యాసిడ్ బాటిల్స్​పగిలిపోయాయి. దీంతో ఒక్కసారిగా ఘాటైన వాయువులు వెలువడి, సుమారు 50 మంది విద్యార్థులు ఉక్కిరిబిక్కిరయ్యారు. కళ్ల మంటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు. కొంతమంది వాంతులు చేసుకున్నారు.

 దీంతో బాధితులను స్కూల్ మేనేజ్ మెంట్ స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ అందించింది. స్కూల్​కు సెలవు ప్రకటించింది. మరోవైపు, విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్​వద్దకు వచ్చి ఆందోళన చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని 
డిమాండ్​ చేశారు.