పాముకాటుకు మంత్రాలు వేసిన వారిపై చర్యలు

పాముకాటుకు మంత్రాలు వేసిన వారిపై చర్యలు

పాము కాటు వేస్తే వెంటనే హాస్పిటల్ తీసుకెళ్తారు. అక్కడ పాము ఏదో తెలిస్తే విషానికి విరుగుడుగా యాంటీ వీనమ్ ఇంజెక్షన్ ఇస్తారు. లేదంటే పాలీ వీనమ్ ఇంజెక్షన్ చేస్తారు. బాధితులు క్రమంగా కోలుకుంటారు. కానీ మధ్యప్రదేశ్ లోని షియోపూర్ జిల్లా హాస్పిటల్ కు ఓ పాముకాటు బాధితున్ని తీసుకొచ్చి చికిత్స చేస్తుండగానే.. పాముకాటు మంత్రం వేయించారు. ఇది వైరల్ గా మారింది. ఇంజెక్షన్ చేసినా మంత్రం వేయించడంపై జిల్లా వైద్యాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వారిపై చర్యలు తీసుకుంటామంటున్నారు. అయితే మధ్యప్రదేశ్ లో గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. మంత్రం వేస్తే పాము విషం విరుగుడు అవుతుందన్న నమ్మకం అక్కడ ఎక్కువగా ఉంది. అయితే ఇలాంటి నమ్మకాలు పని చేయవంటున్నారు డాక్టర్లు.