V6 News

జగిత్యాల జిల్లాలో యాక్టివా ఇంజిన్ నుంచి పొగ... మంటల్లో పూర్తిగా దగ్ధం..

జగిత్యాల జిల్లాలో యాక్టివా ఇంజిన్ నుంచి పొగ... మంటల్లో పూర్తిగా దగ్ధం..

జగిత్యాల జిల్లాలో యాక్టివా స్కూటీ మంటల్లో దగ్దమయ్యింది. ఒక్కసారిగా ఇంజిన్ నుంచి పొగ వచ్చి మంటలు చెలరేగి దగ్దమైంది యాక్టివా. బుధవారం ( డిసెంబర్ 10 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం మద్దునూరులో చోటు చేసుకుంది ఈ ఘటన. బుగ్గారం మండలంలో యాక్టివా 6G స్కూటీ నడుస్తుండగా అకస్మాత్తుగా మంటలు చెలరేగి దగ్దమైంది.

ఇంజిన్ నుంచి పొగ రావడంతో కొద్దిసేపట్లోనే మంటలు పూర్తిగా వ్యాపించాయి. మంటల్లో స్కూటీ పూర్తిగా దగ్దమయ్యింది. ఈ ఘటనలో స్కూటీ ఓనర్ ప్రాణాలతో బయటపడ్డారు. స్కూటీ దగ్దమవ్వడానికి కారణాలు తెలియాల్సి ఉంది. 

ఎలక్ట్రిక్ వాహనాలు తగలబడటం గురించి వార్తలు తరచూ వింటుంటాం కానీ.. పెట్రోల్ వాహనం, అందులోనూ శీతాకాలంలో మంటలు చెలరేగడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయమని చెప్పాలి.