'బుల్లెట్ ట్రైన్' తో మళ్లీ అదరగొట్టిన బ్రాడ్ పిట్

'బుల్లెట్ ట్రైన్' తో మళ్లీ అదరగొట్టిన బ్రాడ్ పిట్

అకాడమీ అవార్డు గెలుచుకున్న ప్రముఖ నటుడు  బ్రాడ్ పిట్ మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ వెండితెరపై కనిపించాడు. బ్రాడ్ పిట్ ప్రధానపాత్రలో భారీ అంచనాల నడుమ తెరకెక్కిన ‘బుల్లెట్ ట్రైన్’ అనే ఈ యాక్షన్ -కామెడీ చిత్రం ఆగష్టు 4న విడుదలైంది. ఈ మూవీలో హీరో కామెడీతో పాటు, ఉత్తేజకరమైన యాక్షన్ సన్నివేశాలు నాన్-స్టాప్ ఎంటర్టైన్మెంట్‌ను తెచ్చిపెట్టాయి. దేశ వ్యాప్తంగా ప్రశంసలందుకుంటున్న ఈ చిత్రం సూపర్‌సోనిక్ స్పీడ్ తో దూసుకుపోతోంది. 

ది క్యూరియస్ కేస్ ఆఫ్ బెంజమిన్ బటన్, టరాన్టినోస్ ఇన్గ్లోరియస్ బాస్టర్డ్స్, మనీబాల్, ఓషన్స్ – ఓషన్స్ ఎలెవెన్, ట్వెల్వ్ వంటి బ్లాక్ బస్టర్ అవార్డ్ విన్నింగ్ చిత్రాలలో బ్రాడ్ పిట్ నటించాడు. క్వెంటిన్ టరాన్టినో యొక్క వన్స్ అపాన్ ఎ టైమ్‌లో అకాడమీ అవార్డు గెలుచుకున్న ప్రదర్శనలను హాలీవుడ్‌లో లియోనార్డో డికాప్రియో మరియు యాడ్ ఆస్ట్రాతో కలిసి అందించాడు. ఇక ఆయన తాజా చిత్రం బుల్లెట్ ట్రైన్‌తో మరోసారి అదే మ్యాజిక్‌ను తెరపైకి తీసుకువచ్చాడు. రీసెంట్ గా దేశవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా అందర్నీ ఆకట్టుకుంటోంది. డెడ్‌పూల్ 2 దర్శకుడు డేవిడ్ లీచ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కోటారో ఇసాకా యొక్క బెస్ట్ సెల్లర్ మరియా బీటిల్ ఆధారంగా రూపొందించబడింది.