తొలిసారిగా.. గెస్టుగా కాదు.. హోస్టుగా..

V6 Velugu Posted on Jan 01, 2020

మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘సరిలేరు నీ కెవ్వరు’. దిల్ రాజు సమర్పణలో అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. జనవరి 11న సినిమా విడుదల కానున్న సందర్భంగా అనిల్ సుంకర ఇలా ముచ్చటించారు. ‘‘మహేష్
బాబు గారితో ఓ ఎంటర్ టైనర్ తీయాలనుకుని ప్రారంభించాం. అయితే నిన్న సినిమా చూశాక అందరికీ గుర్తుండిపోయే మంచి సినిమా చేశామని గర్వంగా అనిపించింది. టీమ్ అంతా 140 రోజులపాటు నిద్రాహారాలు లేకుండా వర్క్ చేశారు. ఇండియన్ సోల్జర్స్‌కి ట్రిబ్యూట్ ఈ సినిమా. సినిమా చూశాక వారిపై గౌరవం మరింత పెరుగుతుంది. ఫ్యాన్స్‌తో పాటు యూత్, ఫ్యామిలీస్ ఆశించే అన్ని అంశాలు ఉన్నాయి. మహేష్ కెరీర్లో‌ని టాప్ 5 సినిమాల్లో ఇది కచ్చితంగా ఉంటుంది. రష్మిక బబ్లీ క్యారెక్టర్‌లో నటించింది. విజయ శాంతి గారి నటనకు అవార్డులు రావడం ఖాయం.

మహేష్, విజయశాంతి గారి కాంబినేషన్ సీన్స్ సినిమాకు బిగ్గెస్ట్ సెల్లింగ్ ఫ్యాక్ట‌ర్. హీరో ఆర్మీ నుండి రాయలసీమకు వస్తాడనేది అందరికీ తెలిసిన కథే. కానీ వచ్చి ఏం చేస్తాడనేది దర్శకుడు అద్భు తంగా తెరకెక్కించాడు. ఇప్పటి వరకూ రాని యునిక్ పాయింట్ ఉంది. ప్రతి సీన్‌కి నవ్వులు, క్లాప్స్, విజిల్స్ పడతాయి. అవి లేని చోట ఎమోషన్‌తో కన్నీళ్లు వస్తాయి. అనిల్ ఎంటర్టైన్మెంట్ మాత్రమే తీస్తాడనే ఇమేజ్ ఉంది. కానీ ఇది శంకర్ చిత్రాల తరహాలో ఉంటుంది. మహేష్ లాంటి స్టార్‌తో ఏమేమి చేయొచ్చో అన్నీ చేశాడు అనిల్. దేవిశ్రీ అద్భుతమైన సంగీతం అందించారు. వినేటప్పుడు కంటే చూసేటప్పుడు ఇంకా బెటర్‌‌గా ఉంటుంది. మహేష్ బాబు గారి కెరీర్‌‌లో బిగ్గెస్ట్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం. మహేష్ హోస్ట్ చేస్తున్న ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి చిరంజీవి అతిథిగా వస్తున్నారు. అందుకే జనవరి 5న జరగనున్నది మెగా సూపర్ ఈవెంట్.”

Tagged Mahesh babu, Actor Mahesh Babu, Sarileru Neekevvaru, Rashmika Mandanna, anil ravipudi, prerelease event

Latest Videos

Subscribe Now

More News