
ముప్ఫయ్యేళ్ల కెరీర్‌లో ఎన్నో సిని మాలు చేశాను. తెలుగు ప్రేక్షకులు, డైరెక్టర్స్, రైటర్స్, ప్రొడ్యూసర్స్ చూపించిన ప్రేమ మాత్రం ప్రత్యేకం. నా అదృష్టంకొద్దీ మంచి పాత్రలు వస్తున్నాయి. ఏ పాత్రయినా సమాన మైన ఎఫర్ట్ పెడతాను. ప్రతిరోజూ షూటింగ్‌కి ఫుల్‌గా ప్రిపేరై వెళ్తాను. నా బెస్ట్ ఇస్తాను. కానీ తండ్రి పాత్ర చేయడం నాకు అన్నిటికంటే ఇష్టం.
నెగిటివ్ రోల్ అయినా, పాజిటివ్ పాత్రయినా.. దేనినైనా తనదైన శైలిలో పండిస్తారు మురళీశర్మ. ‘సాహో’లో ఒక కీలక పాత్ర పోషించిన ఆయన.. ఆ సినిమా గురించి ఇలా ముచ్చటించారు.
‘భాగమతి’ చేస్తున్నప్పుడు సుజీత్ ఈ కథ చెప్పాడు. చాలా నచ్చేసింది. ఇలాంటి సినిమా తీయాలంటే గొప్ప స్క్రిప్ట్ ఉండాలి. అలాంటి స్క్రిప్ట్, ప్రభాస్ లాంటి పెద్ద స్టార్ ఉన్న సినిమాలో అవకాశం రావడంతో చాలా సంతోషపడ్డాను.
ఒక సినిమా బాగా రావాలంటే ముందు దాన్ని అందంగా నేరేట్ చేయాలి. సుజీత్ సూపర్బ్ వర్క్ చేశాడు. చాలా లేయర్స్ ఉన్న కథ. దేని గురించి మాట్లాడినా సస్పెన్స్ రివీలైపోతుందేమో అని భయపడేంత పకడ్బందీగా రాశాడు.
ప్రభాస్‌ని అందరూ డార్లింగ్ అంటారు. అలా ఎందుకంటారనేది ఈ సినిమాకి పని చేస్తున్నప్పుడు తెలిసింది. ఒకరోజు తను కుర్తాలాంటిది వేసుకున్నాడు. బాగుందని చెప్పాను. ఆ రోజు సాయంత్రానికి అలాంటిదే ఒకటి నా క్యారవాన్‌లో ఉంది. అలాగే మొదటిరోజు లంచ్ టైమ్‌లో నాకు ఇంటి ఫుడ్ అంటే ఇష్టమని చెప్పాను. ఆ రోజు నుంచి నేను పని చేసినన్ని రోజులూ నాకు ఆయన ఇంటి నుంచే భోజనం వచ్చింది. అంత గొప్ప మనిషి. ఇక పని విషయంలో చాలా సిన్సియర్. ఎంత హార్డ్ వర్క్ చేస్తాడంటే.. అది స్వయంగా చూస్తేనే అర్థమవుతుంది.
నిర్మాతలు కూడా చాలా మంచివాళ్లు. కోట్ల బడ్జెట్ పెట్టి ఇంత గొప్ప సినిమాని తీశారు. వాళ్ల ప్రవర్తన కూడా అంతే గొప్పగా ఉంటుంది. రేయింబవళ్లూ సెట్‌లో ఉండేవారు. ప్రతిదీ దగ్గరుండి చూసుకునేవారు.
ఒక సినిమాని ఒకేసారి మూడు భాషల్లో చేయడం ఎక్సైటింగ్‌గా ఉంటుంది. ఒక భాషలో డైలాగ్ అవ్వగానే మరో భాషలో చెప్పాలి. ‘అభినేత్రి’ సినిమా విషయంలో అలానే జరిగింది. ఇప్పుడు ‘సాహో’. నాకు భాషలు నేర్చుకోవడం చాలా ఇష్టం. మా అమ్మ తెలుగావిడ. తనతో మాట్లాడటం వల్ల తెలుగు వచ్చింది. చిన్నప్పుడు సౌత్ ఇండియన్ వెల్ఫేర్ సొసైటీ స్కూల్‌లో చదువుకోవడం వల్ల తమిళం వచ్చింది. నా భార్య మరాఠీ అమ్మాయి కావడం వల్ల అది వచ్చింది. ఓ ఫ్రెండ్ ద్వారా పంజాబీ నేర్చుకుంటున్నాను. త్రివిక్రమ్‌గారి సినిమాకి పని చేసే క్రమంలో యాక్టర్ జయరామ్‌గారి దగ్గర మలయాళం నేర్చుకుంటున్నాను. అందుకే ఏ భాష అయినా ఇబ్బంది లేకుండా డైలాగ్ చెబుతాను.
సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో చిత్రాల్లో మంచి పాత్రలు పోషిస్తున్నాను. శర్వానంద్, సందీప్ కిషన్ మూవీస్‌లోనూ
చేస్తున్నాను. మారుతి సినిమా కూడా చేస్తు న్నాను. ఇలా డిఫరెంట్ పాత్రలు చేస్తూ నటుడిగా పూర్తి సంతృప్తితో ఉన్నాను.