మూసీ పేరుతో పేదల ఇండ్లు కూల్చొద్దు : ఎమ్మెల్సీ గోరటి వెంకన్న

మూసీ పేరుతో పేదల ఇండ్లు కూల్చొద్దు : ఎమ్మెల్సీ గోరటి వెంకన్న

ముషీరాబాద్, వెలుగు: మూసీ పరివాహక ప్రాంతాల్లో ఎన్నో ఏళ్లుగా కష్టపడి నిర్మించుకున్న పేదల ఇండ్లను కూల్చే హక్కు ప్రభుత్వానికి లేదని ప్రముఖ కవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న అన్నారు. తెలంగాణ సోషల్ ఫౌండేషన్ చైర్మన్ నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘మూసీ సుందరీకరణ – వాదాలు, వివాదాలు’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గోరటి వెంకన్న మాట్లాడుతూ.. మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న బాధితులకు ముందుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు.

అఖిలపక్షాలతో చర్చించకుండా ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవద్దన్నారు. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలకు ఎలాంటి నష్టం జరిగినా ఆందోళనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. రాజకీయ విశ్లేషకుడు అయాచితం శ్రీధర్, మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, నంద్యాల నర్సింహారెడ్డి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ సీతారామరావు, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నేత కె. గోవర్ధన్ పాల్గొన్నారు.