- ఆయనకు రాజ్యసభ సీటు ఇచ్చేవారు
పంజాగుట్ట, వెలుగు: సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడటంపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. ఆయన నిర్ణయం బాధాకరమని, పార్టీ మార్పు విషయంలో ఆయన తొందరపడ్డారని వ్యాఖ్యానించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మీడియాతో దానం ముచ్చటించారు. జీవన్ రెడ్డి పార్టీలోనే ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా కోరుకున్నారని, భవిష్యత్తులో ఆయనకు రాజ్యసభ అవకాశం కల్పించేలా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసిందన్నారు.
ఎంపీ మల్లు రవి, మంత్రి శ్రీధర్ బాబు, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ వంటి పెద్దలు ఆయన్ను కలిసి ఎంత నచ్చజెప్పినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని తెలిపారు. పార్టీలో సముచిత స్థానం ఉండే అవకాశం ఉన్నప్పటికీ ఆయన ఇలాంటి నిర్ణయం తీసుకోవడం బాధకరమేనన్నారు.
